వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు, రాష్ట్రవ్యాప్తంగా (trs dharna on grain purchase) ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదు..
తెలంగాణ వస్తే అడుక్కుతింటారని అప్పట్లో అన్నారని.. ఇప్పుడు పైసలు లేక ఆంధ్రా వాళ్లు బిచ్చమెత్తుకుంటున్నారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదని.. కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నామని చెప్పారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారని... రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై (minister Prasanth reddy sensational comments on ap cm) ఆధారపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదని.. రోజు గడవాలంటే కేంద్రం నుంచి ఏపీకి నిధులు కావాలని ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
'మీటర్లు పెట్టకపోతే.. లోన్లు ఇవ్వమన్నారు..'
విద్యుత్ మీటర్లు పెట్టకపోతే.. లోన్లు ఇవ్వమని ఏపీ సీఎంపై (minister Prasanth reddy sensational comments on ap cm) ఒత్తిడి తీసుకువచ్చారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారని చెప్పారు. దేశం మొత్తం బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని.. మనం మాత్రం భాజపా వాళ్ల కింద మీటర్లు పెట్టాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వైఖరిపైనా మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి (trs dharna on grain purchase) అవలంభిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో భాజపా నేతలు కుటిల రాజకీయాలు చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. వచ్చే యాసంగి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
'ఇళ్లను ముట్టడించండి'
గ్రామ స్థాయిలో భాజపా నేతలను అడ్డుకోవాలని... కమలం పార్టీ నేతల ఇళ్లను ముట్టడించాలని తెరాస శ్రేణులకు మంత్రి సూచించారు. ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన తెరాస పోరాడుతుందని స్పష్టం చేశారు. వచ్చే పంట కాలంలో వరి ధాన్యాన్ని కొనుగోలు (trs dharna on grain purchase) చేస్తామని హామీ పత్రం తీసుకొస్తే సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రి వరకు రైతుల వెంట ఉండి వరినాట్లు వేయిస్తామని.. ఈ సందర్భంగా బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.
నిజామాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో (trs dharna on grain purchase) రాజ్యసభ సభ్యుడు కే సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి.
'తెలంగాణ వస్తే అడుక్కుతింటారని మనల్ని అన్నారు. కేసీఆర్ దయతో మన ఆదాయం మనమే అనుభవిస్తున్నాం. ఇప్పుడు మన పైసలు ఆంధ్రాకు పోవట్లేదు. ఆంధ్రా వాళ్లు పైసలు లేక బిచ్చమెత్తుకుంటున్నారు. ఏపీలో సీఎం జగన్ బిచ్చమెత్తుతున్నారు. రోజు ఖర్చుల కోసం కూడా కేంద్రంపై ఆధారపడుతున్నారు. ఇప్పుడు అప్పులు లేకపోతే ఆంధ్రా నడవదు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గి ఏపీలో బోర్లకు మీటర్లు పెడుతున్నారు. దేశం మొత్తం బోర్లకు మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం మాత్రం భాజపా వాళ్ల కింద మీటర్లు పెట్టాలి.'
-మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఇదీచూడండి: 'టేబుల్ టేబుల్‌కు తిరిగి దండం పెట్టినా పని కాలేదు.. అందుకే...'