నాలుగు నెలల క్రితం గెలిచిన సర్పంచ్ ఇప్పుడు భిక్షాటన చేస్తున్నాడు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ జోలె పట్టి అడుక్కుంటున్నాడు.
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం సిరన్‌పల్లిలో సుధాకర్‌రావు సర్పంచ్‌గా గెలిచాడు. నాలుగు నెలలు గడుస్తోన్న ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వలేదు. ఓవైపు గ్రామంలో సమస్యలు..మరోవైపు సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఏం చేయలో పాలుపోక సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు ఇలా బిక్షాటన చేశాడు.
గతంలో ఎమ్మార్వో లంచం అడిగాడని వృద్ధ దంపతులు భిక్షాటన చేయగా.. సర్టిఫికేట్లు ఇవ్వడగానికి కళాశాల యాజమాన్యం నగదు డిమాండ్ చేసిందని ఓ విద్యార్థి భిక్షమెత్తాడు. ఇప్పుడు ఈ సర్పంచ్ కూడా వార్తల్లోకెక్కాడు.
ఇవీ చూడండి: పరోక్ష ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో కొత్త సెక్షన్