కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట గ్రామ శివారులో మినీ బస్సు బోల్తా పడింది. 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 5 కుటుంబాలకు చెందినవారున్నారు. హైదరాబాద్ మూసాపేట్‌కు చెందిన 5 కుటుంబాలు ఈ రోజు ఉదయం ఓ మిని బస్సులో బాసరకు బయలుదేరారు.
తిరుగుప్రయాణంలో మల్లుపేట గ్రామ శివారుకు రాగానే వెనక టైర్ పేలి బస్సు మూడు పల్టీలు కొట్టింది. డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 12 మంది పెద్దలు, 9 మంది చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చూడండి: ఆ రైతుల సంకల్పంతో.. బీళ్లలో బంగారం పండుతోంది!