నిజామాబాద్ జిల్లాలో కరోనా వల్ల ఎక్కువ మరణాలు సంభవించలేదని, పరిస్థితి విషమించితే అందుకు అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని, ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. కలెక్టరేట్ భవనంలో పలువురు ప్రజా ప్రతినిధులతో సమావేశమైన ఆయన.. ప్రజా ప్రతినిధులు అధికారులకు సహకరించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని కొవిడ్-19 ప్రొటోకాల్ ప్రకారం గుండెపోటు, ప్రమాదం, ఆత్మహత్య మరణాలు కాకుండా మిగతా మరణాలను కొవిడ్ కోణంలో మానిటరింగ్ చేస్తామని తెలిపారు. గత మూడు రోజులుగా పంపిన నమూనాల్లో పాజిటివ్ రాలేదన్నారు. ప్రజలందరూ అధికారులకు సహకరించి నిబంధనలు పాటిస్తూ.. ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఎంత ఓపిక పడితే.. అంత తొందరగా వైరస్ నుంచి విముక్తి లభిస్తుందన్నారు.
ఇదీ చదవండి: రోగికి సాయం కోసం బైక్పై 430కి.మీ ప్రయాణం