ETV Bharat / city

'కొవిడ్​ నిబంధనలు పాటిస్తూనే ఎన్నికల ప్రచారం చేసుకోవాలి' - nizamabad mlc elections updates

అక్టోబర్​ 9న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. కొవిడ్​ నిబంధనలకు లోబడే ప్రచారం చేసుకోవాలని సూచించారు. 100 మందికి మించకుండా సమావేశాలు నిర్వహించుకోవచ్చని కలెక్టర్​ వివరించారు.

nizamabad collector narayana reddy review on mlc by elections

author img

By

Published : Sep 27, 2020, 11:13 AM IST

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారాన్ని రాజకీయ పార్టీలన్నీ కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని నిజామాబాద్​ జిల్లా కలెక్టర్​ సి. నారాయణ రెడ్డి సూచించారు. అక్టోబర్ 9న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిబంధనలపై రాజకీయ పార్టీలతో పాలనాధికారి సమావేశమయ్యారు. ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని, నిన్నటి నుంచి ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ప్రచారం చేసే క్రమంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తేవాలన్నారు.

బ్యాలెట్ పేపర్​పై అభ్యర్థి పేరు, ఫొటో, పార్టీ పేరు ఉంటుందని.. గుర్తు ఉండదని తెలిపారు. ఓటరుకు అంకెలు మాత్రమే వేయాలని, పేర్లు రాయడం, టిక్కులు చేయడం చేయరాదన్నారు. ఈ విషయంలో ఓటర్లకు అవగాహన కల్పించాలని, మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారన్నారు. అక్టోబర్ 12 తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుందని కలెక్టర్​ తెలిపారు.

సోషల్ మీడియాలో పోస్టులను పర్యవేక్షించడానికి నిజామాబాద్ సీపీ కార్యాలయం, కామారెడ్డి ఎస్పీ ఆఫీస్​, కలెక్టరేట్ ఎంసీసీలో సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. మోడల్ కోడ్​ను ఎవరు ఉల్లంఘించినా... కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశాల్లో 100 మందిని మాత్రమే అనుమతించాలని తెలిపారు.

ఇదీ చూడండి: నిజామాబాద్​ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో ముగ్గురు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.