నిజామాబాద్ ఎగువున ఉన్న జలాశయాల నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని గోదావరి, పూర్ణ నదులపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై నిజామాబాద్ జిల్లా పాలనాధికారికి నాందేడ్ కలెక్టర్ నుంచి సమాచారం వచ్చింది. ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం స్వల్పంగా తగ్గుతోంది. ప్రస్తుతం గోదావరిలో 52.5 అడుగులకు నీటిమట్టం తగ్గింది.
ఇవీచూడండి: పులిచింతల ప్రాజెక్టుకు పెరిగిన ప్రవాహం.. 16 గేట్లు ఎత్తివేత