ETV Bharat / city

'మోకాళ్ల యాత్రే చేస్తారో.. మోకరిల్లుతారో.. బోర్డు మాత్రం పట్టుకురండి..'

MLC Kavitha comments: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్​పై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పసుపుబోర్టు తీసుకొస్తానని మూడేళ్ల క్రితం హామీ ఇచ్చిన ఎంపీ.. ఇప్పటికీ తీసుకురాలేకపోవటంపై నిజామాబాద్​ ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. పసుపు బోర్డు, మద్దతుధరపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు.

MLC Kavitha comments on nizamabad mp darmapuri arvind about turmeric board

author img

By

Published : May 4, 2022, 3:15 PM IST

Updated : May 4, 2022, 3:53 PM IST

MLC Kavitha comments: హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప భాజపా నేతలు చేసిందేమీ లేదని తెరాస ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్​లో ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో, కేంద్రంలో అభివృద్ధిని ప్రజలు గమనించాలని కవిత కోరారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథేచ్ఛగా పెంచారన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మూడేళ్ల కిందట పసుపు బోర్డు తెస్తానని మాట ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. అర్వింద్‌కు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉందని.. పసుపుబోర్డు ఎప్పుడు తెస్తారని ప్రశ్నించారు. నిజామాబాద్‌ ప్రజలకు ఏం జవాబు చెబుతారని నిలదీశారు. పసుపు విషయంపై స్పష్టంగా ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు.

"పసుపుకు మద్దతు ధర ఇస్తామని ఎంపీ చెప్పారు. ఆ విషయం ఏమైంది? పార్లమెంట్‌లో దీనిపై ఎప్పుడు మాట్లాడారు? ఈ మూడేళ్లలో ఎంపీ అర్వింద్‌ పార్లమెంట్‌లో ఐదుసార్లు మాట్లాడారు. ఆ సమయంలో పసుపు బోర్డు గురించి మాట్లాడలేదు. మద్దతు ధర ఇవ్వమని అడగలేదు. మన పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి దిల్లీలో తాకట్టు పెట్టిన వ్యక్తి ఈ అధర్మపురి అర్వింద్. ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలడి పొద్దు గడుపుతారు? ఎర్రజొన్నకు మద్దతు ధర ఇస్తామన్నారు. అది ఏమైంది? రైతుల రాబడి రెట్టింపు చేస్తామన్నారు. ఆ విషయంలో పురోగతి ఏది? వీటిపై నిజామాబాద్‌ ప్రజలకు జవాబు చెప్పాలి. ఇచ్చిన హామీల గురించి ప్రయత్నాలు చేస్తారేమో అని మూడేళ్లు విడిచిపెట్టాం. ఇక విడిచిపెట్టేది లేదు. మీరు దిల్లీలో మోకాళ్ల యాత్ర చేస్తారో.. మీ దిల్లీ నాయకుల వద్ద మోకరిల్లి పసుపు బోర్డు సాధించుకోని వస్తారో.. ఏం చేస్తారో చేయండి. బాండు పేపర్‌లో చెప్పినట్లు పసుపు బోర్డు పట్టుకొనే రండి. లేకపోతే ఏ గ్రామానికి పోయినా అడుగడుగునా నిలదీస్తాం. పసుపుబోర్డు కాకుండా రూ.కోటీ 92లక్షలతో స్పైస్‌ బోర్డు తెచ్చి.. ఓ అపార్ట్‌మెంట్‌లో పెట్టారు. దీని గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఉపయోగం కూడా ఏమీ లేదు"

- కవిత, ఎమ్మెల్సీ

'మోకాళ్ల యాత్రే చేస్తారో.. మోకరిల్లుతారో.. బోర్డు మాత్రం పట్టుకురండి..'

ఇవీ చూడండి:

Last Updated : May 4, 2022, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.