కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో ఆరో విడత హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే గంప గోవర్ధన్, కలెక్టర్ శరత్ కుమార్ కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో అధికారులు, కార్మికులు అకుంటిత దీక్షతో ముందుకు కదులుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు అభినందించారు.
ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగంగా మొక్కలు నాటాలని... నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం కాలనీల్లో చెత్తను డంపింగ్ యార్డుకు చేరవేసే వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.