జీవవైద్య వ్యర్థాల నిర్వహణ గురించి నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మేయర్ నీతూ కిరణ్ మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్‌వో,ఐఎంఏ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ప్రతి మెడికల్ వేస్టేజ్‌ను ఉత్పత్తి చేసే ఆసుపత్రులు, ప్యాథలాజికల్ ల్యాబ్స్, నర్సింగ్ హోంలు, బ్లడ్ బ్యాంకులు కలిసి మెడికేర్ సర్వీసెస్ వారితో అనుసంధానం చేసుకోవాలని మేయర్ తెలిపారు.
నిజామాబాద్‌ను వ్యర్థ రహిత నగరంగా మార్చుకునేందుకు చర్యలు చేపట్టామని అందులో భాగంగా జీవవైద్య వ్యర్థాలను ఎలా తొలగించాలో నిర్ణయించేందుకు అధికారులు, వైద్యులతో చర్చించినట్లు మేయర్ నీతూ కిరణ్ తెలిపారు. ఈ మెడికల్ వేస్ట్‌ను ఎక్కడపడితే అక్కడ పారేస్తే ప్రజలకు ఎన్నో రకాల రోగాలు వచ్చే అవకాశాలునన్నాయని.. అందుకే వారికి కేటాయించి చెత్త డబ్బాల్లోనే వేయాలని మేయర్ సూచించారు.