కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు ఘర్షణలకు దారి తీస్తోంది. రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి తండాలో మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఘటనలో పలువురి తలలు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గత ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన మదన్ మోహన్ రావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న సుభాశ్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. తాజాగా ఎల్లారెడ్డి పల్లి తాండలో కాంగ్రెస్ పార్టీ రచ్చబండ నిర్వహిస్తున్న క్రమంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. మదన్ మోహన్ రావు వర్గీయులు తమపై అకారణంగా దాడి చేశారని సుభాశ్ రెడ్డి వర్గం ఆరోపిస్తోంది. రచ్చబండ చేపట్టేందుకు వెళ్తే దాడికి పాల్పడటం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ రావుపై సస్పెన్షన్ విధించిందని.. ఎక్కడా ఎత్తేసినట్టు ఆదేశాలు లేవని సుభాష్ రెడ్డి ఆరోపించారు. కావాలని రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారని కార్యకర్తలు ఆరోపించారు.
ఇవీ చదవండి: