ఇవీ చూడండి:
బట్టలిస్తామని చెప్పి పిల్లాన్ని ఎత్తుకెళ్లిన మహిళలు.. వీడియో వైరల్..!
పిల్లల్ని అపహరిస్తున్న పలువురు మహిళలు.. నిజామాబాద్‌లో కలకలం సృష్టించారు. భిక్షాటన చేస్తున్న తల్లికి దుస్తులు ఇస్తామని నమ్మించి ఆమె దగ్గరున్న పిల్లాన్ని ఎత్తుకుపోయారు. వినాయక్‌నగర్ పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కుమారుణ్ని వెతికి ఇవ్వాలంటూ ఓ తల్లి పోలీసులకు చేసిన ఫిర్యాదుతో.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాలుణ్ని అపహరించిన వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
Group of Women kidnapped a child from a beggar in nizamabad and cc visuals viral
ఇవీ చూడండి: