నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు ఉండగా... ప్రస్తుతం 1090.5 అడుగులకు నీరు చేరుకుంది. శ్రీరాంసాగర్ జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 90.313 కాగా.. ప్రస్తుతం 87.56 టీఎంసీల నీరు ఉంది.
ఎస్సారెస్పీ జలాశయంలోకి 27, 858 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నీటిపారుదల శాఖ అధికారులు 17, 493 క్యూసెక్కుల నీటిని దిగువనున్న మిడ్మానేరులోకి విడుదల చేశారు. వరద ఉద్ధృతి ఇలాగే కొనసాగితే.. ప్రాజెక్టు మెయిన్ గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదలనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్