నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నిన్న నలుగురు మృత్యువాత పడ్డారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన జరిగింది. నలుగురిలో ముగ్గురు కొవిడ్ బాధితులు ఉన్నారు. మరొకరు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆక్సిజన్ అందకే ఇద్దరు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కరోనాతో ఒకరు, గుండెపోటుతో మరొకరు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు నిజామాబాద్ నగరానికి చెందినవారు కాగా.. మిగిలినవారు భీంగల్, ఎడపల్లి ప్రాంతవాసులుగా గుర్తించారు.
ఆస్పత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కొద్దిసేపు ఆందోళన చేశారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ అంశంపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది.
ఇవీచూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..