ETV Bharat / city

కొవిడ్​పై అనుమానాలా?.. కలెక్టరేట్‌లో మీ కోసం కాల్​సెంటర్ - nizamabad collectorate

కరోనా వల్ల వైద్యసేవల గురించి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్షణాలపై అనుమానాలు, పరీక్ష, టీకా కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాలు, హోం ఐసోలేషన్ చికిత్స, వ్యాక్సిన్‌పై.. ఎవరిని అడగాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. వారి కష్టాలను గమనించిన అధికారులు.. కొవిడ్ సహాయ కేంద్రం ఏర్పాటుచేసి 24గంటల పాటు సేవలందిస్తున్నారు. కొవిడ్ సంబంధిత ఏ సమస్య చెప్పినా, ఏ వివరాలు అడిగినా తక్షణం సాయం అందిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు.

Covid Helpline center started in nizamabad collectorate
కొవిడ్​పై అనుమానాలా?.. కలెక్టరేట్‌లో మీ కోసం కాల్​సెంటర్
author img

By

Published : May 9, 2021, 3:27 PM IST

కొవిడ్​పై అనుమానాలా?.. కలెక్టరేట్‌లో మీ కోసం కాల్​సెంటర్

ప్రస్తుతం కరోనా వైరస్‌ అనగానే చాలామందిలో ఎన్నో రకాల భయాలు.. ఎన్నో సందేహాలు మదిలో మెదులుతాయి. ఎక్కడ వైద్యం అందిస్తారు, ఎవరినీ సంప్రదించాలన్న విషయంపై చాలామంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి భరోసా కల్పిస్తోంది నిజామాబాద్‌ కలెక్టరేట్​లోని కొవిడ్ సహాయ కేంద్రం. ఆ హెల్ప్‌డెస్క్కిఫోన్ చేస్తే అధికారులు వారిసమస్యలు తెలుసుకొని సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ముగ్గురు వైద్య సిబ్బందితోపాటు....., ఓ రెవెన్యూ అధికారి అందుబాటులో ఉంటున్నారు. వచ్చిన ఫిర్యాదుల్ని నమోదు చేయడం.... సమస్యను సంబంధిత అధికారికి తెలియచేస్తూ బాధితుల సమస్య పరిష్కారమయ్యేలా చూస్తున్నారు.

ఏదైనా సమస్య ఉంటే..

గత నెల 19న కలెక్టర్‌ నారాయణరెడ్డి ఈ కొవిడ్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు మొత్తం 500మంది వరకు ఫోన్ చేసి సమస్యలు తెలిపారని అధికారులు వివరించారు. అందులో 300మంది వరకు పాజిటివ్ వచ్చినవారు ఉండగా మిగిలిన వారు కొవిడ్ పరీక్ష, టీకా కేంద్రాలు, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పాజిటివ్ నిర్ధరణ అయితే వైద్యసేవలు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి, ఏ మందులు వేసుకోవాలి, క్వారంటైన్, టీకా కేంద్రాల వివరాలు ఎక్కువగా అడుగుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత మండల వైద్యాధికారికి పంపిస్తున్నారు.

చాలా మందికి తెలియదు..

సహాయ కేంద్రానికి నాలుగు ఫోన్‌ నంబర్లు ఉన్నా.. చాలామందికి ఆ విషయం చేరలేదు. హెల్ప్ లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం.. జనం నుంచి వినిపిస్తోంది. ఫోన్ నంబర్లతో ముద్రించిన ఫ్లెక్సీలను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కరోనా పరీక్ష కేంద్రాలు, టీకా కేంద్రాలు, ప్రధాన కూడళ్లు, కాలనీల్లో ప్రదర్శిస్తే ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది.

సంప్రదించాల్సిన నంబర్లు.. 08462-220183, 184, 185, 08462-223545

ఇవీ చూడండి: 'జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.