అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ... నిజామాబాద్‌లో ఎంపీ అర్వింద్‌కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. 2020 నూతన జాతీయ విద్యావిధానం చట్టంలో ఐసీడీఎస్ ప్రస్తావనే లేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ ఆరోపించారు. అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం కలిగించే నూతన జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఎంపీని కోరారు.
అంగన్వాడీ కేంద్రాలను బలపరచి... మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ .21,000/- లు చెల్లించాలని కోరారు. అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ అర్వింద్‌కు ఓ వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణ, అంగన్వాడీ జిల్లా నాయకులు అనుసూయ, భూమవ్వ తదితరులు పాల్గొన్నారు.