ETV Bharat / city

ఎంపీ ఇలాకాలో కూలిన వంతెన.. స్తంభించిన రాకపోకలు..

Bridge collapsed in Kamareddy: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. పోటెత్తిన వరద ఉద్ధృతికి కామారెడ్డి జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. నిర్మించిన రెండు నెలలకే వంతెన ఇలా కూలిపోయిందంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలిపోగా.. రాకపోకలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

Bridge collapsed
Bridge collapsed
author img

By

Published : Jul 15, 2022, 5:24 PM IST

Updated : Jul 15, 2022, 5:29 PM IST

ఎంపీ ఇలాకాలో కూలిన వంతెన.. స్తంభించిన రాకపోకలు..

Bridge collapsed in Kamareddy: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్‌పూర్‌లో వరద ఉద్ధృతికి ఓ వంతెన కూలిపోయింది. రెండు నెలల క్రితం సుమారు 30 లక్షల రూపాయలతో ఈ వంతెన నిర్మించారు. నాసిరకం పనులు చేయడంతోనే... రెండు నెలలకే వంతెన ఇలా కూలిపోయిందంటూ.. గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇలాకలో పరిస్థితి ఇలా ఉందని స్థానికులు పేర్కొన్నారు.

ఈ మార్గంలో మద్నూర్, జక్కల్ మండలాల వాసులు పోతాంగల్, కోటగిరి, బోధన్, నిజామాబాద్​కు వెళ్తుంటారు. ఇప్పుడు వంతెన కూలిపోగా.. రాకపోకలు లేకపోవడంతో... తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ మార్గం చూపాలని స్థానికులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 15, 2022, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.