ETV Bharat / city

పాసుపుస్తకం కోసం కలెక్టరేట్​లో రైతు ఆత్మహత్యాయత్నం - కలెక్టరేట్​లో రైతు ఆత్మహత్యాయత్నం

పట్టాదారు పాసుపుస్తకం కోసం నాలుగేళ్లుగా కలెక్టరేట్​ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునే వారు లేరంటూ ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజావాణి జరుగుతుండగానే కలెక్టరేట్​లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్​ పోసుకున్నాడు.

పాసుపుస్తకం కోసం కలెక్టరేట్​లో రైతు ఆత్మహత్యాయత్నం..

author img

By

Published : Jul 15, 2020, 4:00 PM IST

కామారెడ్డి జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. అదే సమయంలో తన భూ సమస్యను పరిష్కరించాలని మద్నూర్ మండలం మెనూర్ గ్రామానికి చెందిన కుమ్రొద్దీన్ కలెక్టరేట్​లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్న సిబ్బంది అది గమనించి అతడిని అడ్డుకున్నారు.

సమస్య ఏంటని అధికారులు అడగ్గా.. పట్టాదారు పాస్​బుక్ కోసం నాలుగు సంవత్సరాలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకునే వారే లేరని వాపోయాడు. వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపాడు.

రైతు గోడు విన్న కలెక్టర్​ పాస్​పుస్తకం వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.