గిట్టుబాటు ధరను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. పసుపు బోర్టు ఏర్పాటు చేయాలని కోరితే ప్రధాని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే ప్రాంత, మత సమస్యలు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే అయోధ్య రామ మందిరం భాజపా నేతలకు గుర్తొస్తుందా? అని ప్రశ్నించారు. ప్రధాని ఏ రాష్ట్రం వెళ్లినా అక్కడి సీఎంలను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికొచ్చే అంశాలపై చర్చించే పార్టీలు లేవని... దేశ వ్యవసాయ, ఆర్థిక అంశాలపై చర్చలకు కాంగ్రెస్ భాజపా సిద్ధంగా ఉండవన్నారు.
ఇవీ చూడండి: దేశమే ఆశ్చర్యపోయేలా రెవెన్యూ చట్టం తెస్తాం