ప్రజాప్రస్థానం పాదయాత్రలో (praja prasthanam)భాగంగా పదమూడో రోజు (సోమవారం) వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు (ysrtp president ys sharmila)షర్మిల... నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో పర్యటించారు. పోలేపల్లి రాంనగర్ వద్ద యాత్ర ప్రారంభించి... ఎర్రమట్టితండా, బోటిమీదితండా, చాకలిశేరిపల్లి, గొల్లపల్లి, సమాఖ్యనగర్తోపాటు పలు గ్రామాల్లో ప్రజల్ని కలుసుకున్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నా... కేసీఆర్ పట్టించుకోకపోవడంతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని... నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు. వర్షం పడుతున్నా షర్మిల... తన పాదయాత్రను కొనసాగించారు. ఏడేళ్ల తెరాస పాలనలో ఎనిమిది వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.
సర్కారీ కొలువులకు నోటిఫికేషన్లు రాలేదంటూ ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాలకు చెందిన మహేష్ సూసైడ్ నోట్‌ను మరణ వాంగ్మూలంగా పరిగణించాలని షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్‌పై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చిటాన్పల్లిలో ఉదయం 9:30 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు. కుర్ముడ్గేట్ వద్ద నిరుద్యోగ నిరాహార దీక్ష చేపడతారు.
ఇదీచూడండి: Huzurabad By Election Counting: హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్