ETV Bharat / city

జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్​.. పలువురిపై కేసులు - తెలంగాణలో లాక్​డౌన్​

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్​పోస్ట్​లు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు యంత్రాంగం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారస్తులు, వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ పకడ్భందిగా అమలవుతుంది.

జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్​.. పలువురిపై కేసులు

author img

By

Published : Mar 27, 2020, 8:44 PM IST

యదాద్రి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 40 మంది వ్యాపారస్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మరో 72 మందికి నోటీసులు అందజేశారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతోన్న 300 మందిపై కేసు నమోదు చేశారు. 8 ఆటోలు, 8 కార్లు సీజ్​ చేశారు. వాట్సాప్​లో వదంతులు పోస్ట్​ చేసి.. ఇతరులకు పంపినందుకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా లాక్​డౌన్​.. పలువురిపై కేసులు

కంచెలు వేయొద్దు..

జిల్లాలోని కొన్ని గ్రామాల సరిహద్దుల్లో ముళ్ల కంచె వేసి దిగ్బంధం చేశారు. సంఘటనపై ఇప్పటికే ప్రజాప్రతినిధులకు, గ్రామ ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీసీపీ పేర్కొన్నారు. రాత్రి వేళల్లో కర్ఫ్యూ పకడ్భందీగా అమలవుతుంది. పోలీసులు లాఠీలకు పని చెప్పేసరికి ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా ఖాళీగా దర్శనం ఇస్తోంది.

కాలినడకను ఖమ్మంకు..

హైదరాబాద్​ నుంచి ఖమ్మంకు కాలినడకన వస్తున్న యువతి తారసపడగా పోలీసులు ఆమె వివరాలు తెలుసుకున్నారు. రవాణ సౌకర్యం లేనందున ఖమ్మం జిల్లాకు తన తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో కాలి నడకన ఖమ్మం బయలుదేరినట్లు ఆమె తెలిపంది. వారంతా సొంతూరికి చేరేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

సోడియం హైపో క్లోరైడ్ పిచికారి..

మరోవైపు వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ఫైరింజన్ ద్వారా సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. రాష్ట్ర అగ్ని మాపక శాఖ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లా , జనగామ జిల్లాలో డిస్ ఇన్ఫెక్షన్ సొల్యూషన్​ని పిచికారి చేస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి జయకృష్ణ తెలిపారు.

ఇవీ చూడండి: దత్తత తీసుకున్నారు.. హోటల్​లోనే చిక్కుకుపోయారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.