సర్పంచుల ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యి నెలలు గడుస్తున్నా నేటికీ తమకు చెక్‌పవర్ ఇవ్వకపోవడంపై సర్పంచ్‌లు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని సర్పంచ్ మిర్యాల వెంకన్న భిక్షాటన చేపట్టారు. మునుగోడు పట్టణంలో డబ్బా పట్టుకుని ఇంటింటికీ తిరగుతున్నారు. తమ సమస్యను ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకుని తమకు చెక్‌పవర్ కల్పించాలని అభ్యర్థించారు.
ఇదీ చదవండిః 'ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదం'