ETV Bharat / city

సాగర సమరం: నియోజకవర్గంలోని గ్రామగ్రామాన్ని చుట్టేస్తున్న నేతలు

అభ్యర్థులను వెంట బెట్టుకుని తెరాస, కాంగ్రెస్, భాజపా సీనియర్ నేతలంతా.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ఊర్లను చుట్టి వస్తున్నారు. తమ అభ్యర్థినే గెలిపించాలంటూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సాగర్ ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారంటూ.. తెరాస సామాజిక మాధ్యమ విభాగం ఆధ్వర్యంలో.. హాలియా సమీపంలో లక్ష చదరపు అడుగుల్లో మట్టిపై కేసీఆర్ చిత్రపటానికి రూపకల్పన చేశారు.

political parties speed up nagarjuna sagar by election campaign
సాగర సమరం: నియోజకవర్గంలోని గ్రామగ్రామాన్ని చుట్టేస్తున్న నేతలు
author img

By

Published : Apr 7, 2021, 4:28 AM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉపఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పక్కన హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అలినగర్‌లో.. సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అనే అర్ధం వచ్చేలా తెరాస సోషల్ మీడియా విభాగం లక్ష చదరపు అడుగుల్లో.. కేసీఆర్‌ చిత్రపటానికి రూపకల్పన చేశారు. నియోజకవర్గ పరిధిలోని 60వేల ఎకరాల్లో సాగు నీరు ఇస్తూ.. నెల్లికల్ లిఫ్ట్ ద్వారా మరొక 30వేల ఎకరాల్లో సాగు నీరు ఇవ్వనున్న సందర్భంగా చిత్రం గీశారు.

గడపగడపకు తెరాస..

పెద్దవూర మండలం తెప్పలమడుగు, లింగంపల్లిలో మంత్రి తలసాని, అభ్యర్థి భగత్, బాల్క సుమన్.. ఓటర్లను కలుసుకున్నారు. అదే మండలం సంగారంలో మంత్రి జగదీశ్ రెడ్డి.. అభ్యర్థి భగత్‌తో కలిసి ప్రచారం చేశారు. మాడుగులపల్లి మండలం కన్నెకల్‌లో గడపగడపకు వెళ్లి.. శాసనసభ్యులు జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి ఓట్లు అడిగారు. ఎమ్మెల్యే సురేందర్.. తిరుమలగిరి మండలం తునికినూతలలో ఓటర్లతో ముచ్చటించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో లేని విధంగా.. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, వికలాంగుల పింఛన్లను కేసీఆర్ మాత్రమే అందిస్తున్నారని తలసాని గుర్తు చేశారు.

ప్రసన్నం చేసుకునే పనిలో హస్తం..

కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, సీనియర్ నేత దామోదర్ రెడ్డి.. నిడమనూరు మండలం శాఖాపురం, రాజన్నగూడెం, పార్వతీపురం, వెంగన్నగూడెం, ముకుందాపురంలో పర్యటించారు. హాలియాలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించాయి. తాను చేసిన అభివృద్ధితోనే ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి తమ వద్దకు వలస వచ్చారని... జానారెడ్డి ప్రజలకు వివరించారు.

పదాధికారుల సమావేశంతో కమలం..

గుర్రంపోడు మండలం తేనెపల్లి తండాలో.. భాజపా అభ్యర్థి రవికుమార్ రోడ్ షో నిర్వహించారు. ఉపఎన్నికలో అనుసరించల్సిన వ్యూహంపై.. పదాధికారుల సమావేశంలో చర్చించినట్లు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. బడుగు బలహీన వర్గాలు భాజపాని గెల్పించుకుంటున్నారని... పదాధికారుల సమావేశం అనంతరం ఆయన ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనతో.. తానీషాను తలపించే ముఖ్యమంత్రిగా తయారయ్యారని భాజపా రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్ చుగ్ విమర్శించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటూ.. తెరాస, కాంగ్రెస్ పాలనలపై హాలియా సమావేశంలో ఆయన ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.

నిడమనూరు మండలంలో... తెదేపా అభ్యర్థి మువ్వా అరుణ్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉప ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపిoచాలని.. ఆయన ఓటర్లను అభ్యర్థించారు.

ఇవీ చూడండి.. ప్రజాక్షేత్రంలో చెమటోడ్చుతున్న అభ్యర్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.