ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే చిన్న వైద్యానికి కూడా లక్షల్లో బిల్లు వేస్తారని.. అదే వైద్యానికి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అంత ఖర్చు ఉండదని శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందిస్తున్నారని తెలిపారు. వివిధ అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న బాధితులకు నల్గొండ పట్టణంలోని తన పార్టీ క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి సహాయనిధి కింద 337 మంది బాధితులకు కోటి 43 లక్షల 69వేల 550 రూపాయల విలువ గల చెక్కులను అందించారు. నల్గొండ, తిప్పర్తి, కనగల్ మొదలైన మండలాల్లోని అర్హులైన బాధితులకు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలా.. గతంలో ఏ ప్రభుత్వం ఈ విధంగా ఆదుకోలేదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఎన్నికల తతంగం.. గంటకో నిర్ణయం.. రోజుకో విధానం.!