నల్గొండ ఎస్ఎల్బీసీలోని బత్తాయి మార్కెట్ యార్డులో ఫిబ్రవరి 26న కట్టంగూరు పీఏసీఎస్ ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కందుల కొనుగోలుకు శుక్రవారం నాడు రైతులకు టోకెన్లు ఇచ్చారు. తీరా ఇవాళ తీసుకొస్తే మార్కెట్కు సెలవు అని బోర్డు పెట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా సెలవు ప్రకటించారని రైతులు ఆరోపించారు.
మార్కెట్కు తీసుకొచ్చినప్పుడల్లా 1000 నుంచి 2000 వరకు ఛార్జీలే అవుతున్నాయి. కందులు మార్కెట్కు తీసుకురావాలంటే వీఆర్వో, ఏఈతో సంతకాలు కావాలని సూచించారు. సంతకం కోసం అధికారుల దగ్గరికి వెళితే పంటకు సంబంధించిన ఆధారాలు చూపమంటున్నారని కంటతడి పెడుతున్నారు.
ఇదీ చూడండి: ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం