ETV Bharat / city

Gutha Sukender Comments on BJP : 'అది అంబేడ్కర్​ను అవమానించినట్లు కాదా?' - Gutha Sukender Comments on BJP

Gutha Sukender Comments on BJP : 'ఇప్పటి వరకు 104 సార్లు రాజ్యాంగానికి తూట్లు పొడిచి సవరణలు చేశారు..అది అంబేడ్కర్​ని అవమానించినట్లు కాదా' అని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తాసుఖేందర్​రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కేసీఆర్ సవరణలు చేయాలని అన్నందుకే తప్పొచ్చిందా అని దుయ్యబట్టారు. అంబేడ్కర్ స్ఫూర్తితోనే రాజ్యాంగంలో ఏదైనా పునః సమీక్షలు జరుగుతాయని అన్నారు.

GUTHA FIRE ON BJP
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గుత్తా
author img

By

Published : Feb 8, 2022, 1:59 PM IST

అది అంబేడ్కర్​ను అవమానించినట్లు కాదా?

Gutha Sukender Comments on BJP : కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని..కేటాయించే నిధుల్లోనూ కోత పెడుతుందని శాసన మండలి మాజీ ఛైర్మన్ గుత్తాసుఖేందర్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన హమీలు కేంద్రం గాలికి వదిలేసిందని ఆరోపించారు. 'రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్​రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారిపోయాడు తప్ప..రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టడం లేదు' అని అన్నారు. కేంద్రం తెలంగాణపై అక్కసు, వ్యత్యాసం చూపెడుతోందని గుత్తా విమర్శించారు.

Gutha Sukender Fires on BJP : ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజ్యాంగం గురించి మాట్లాడితే భాజపా వాళ్లు పెడర్థాలు తీస్తున్నారని.. గతంలో ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని పునః సమీక్షించారని గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తుచేశారు. అంబేడ్కర్ స్పూర్తితోనే రాజ్యాంగంలో పునః సమీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదని తేల్చి చెప్పారు. భాజపాకు దమ్ము ఉంటే బయ్యారం స్టీల్ ప్లాంట్, సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన యూనివర్సిటీని తీసుకురావాలని సవాల్ విసిరారు.

చవకబారు ఆరోపణలు మాని..

' రాజ్యాంగాన్ని పునఃసమీక్ష చేయాలని సీఎం కేసీఆరే మొదటిసారి అనలేదు.ఇదే భాజపా, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటి వరకు 104 సార్లు రాజ్యాంగానికి తూట్లు పొడిచి సవరణలు చేశాయి..అది అంబేడ్కర్​ని అవమానించినట్లు కాదా ? ప్రభుత్వ సంస్థలు అమ్మడమే భాజపా పనిగా పెట్టుకుంది. కాషాయ నేతల పాలనలో అంబానీలు, అదానీలు తప్ప పేద ప్రజలెవరూ బాగుపడలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. దాన్ని చూసి ఓర్వలేక భాజపా కుట్రలు చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం తెలంగాణ భాజపా ఎంపీలకు లేదు. చవకబారు ఆరోపణలను భాజపా నాయకులు అపాలి. చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చడం వాళ్లకి చేతకావడం లేదు. సీఎం కేసీఆర్ ఏది మాట్లాడినా వివాదం చేయడమే పనిగా పెట్టుకున్నారు. వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు.'

- గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి మాజీ ఛైర్మన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.