ETV Bharat / city

ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న అన్నదానం - భాజపా నాయకుల అన్నదానం

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతకాలంగా భాజపా నాయకులు, కార్యకర్తలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేస్తున్నట్టు నాయకులు తెలిపారు.

food ddistrubution in nalgonda district hospital by bjp leaders
ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న అన్నదానం
author img

By

Published : May 3, 2020, 11:42 PM IST

Updated : May 3, 2020, 11:55 PM IST

లాక్​డౌన్‌ కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధాని పిలుపు మేరకు భాజపా నాయకులు... నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతకాలంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకొని కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ప్రతి రోజూ ఒకరి చొప్పున నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న పట్టణానికి చెందిన యెదుపాటి యుగ ప్రవీణ్‌ సహకారంతో 400 మందికి ఇవాళ అన్నదానం చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు బండారు ప్రసాద్, మాదగోని శ్రీనివాస్ గౌడ్, మొరిశెట్టి నాగేశ్వరరావు, రుద్ర మహేష్, రావిరాల వెంకట్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 20 కిలోమీటర్లు గుట్టల్లో నడిచి.. సరకులు పంచిన సీతక్క

Last Updated : May 3, 2020, 11:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.