ETV Bharat / city

కథనానికి స్పందన.. బాధితుడిని ఆదుకున్న సెర్వ్​ ఫౌండేషన్​..

author img

By

Published : Sep 25, 2022, 11:00 AM IST

గోపాల్​ గోస అనే శీర్షికతో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​లో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న గోపాల్​కు ఆర్థిక సాయం అందించారు.

EENADU, ETV story RESPOND
ఈనాడు ఈటీవీ కథనానికి స్పందన

Response: ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​ కథనానికి స్పందించి 'రెడీ టు సెర్వ్' ఫౌండేషన్ ఓ కుటుంబానికి చేయూతనందించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన జంపాల గోపాల్ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మంచానికే పరిమితమయ్యారు. ఈ విషయమై ఇటీవల 'గోపాల్ గోస' అనే శీర్షికన ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​లో కథనానికి రెడీ టు సెర్వ్ ఫౌండేషన్ స్పందించింది.

గోపాల్ కుటుంబానికి శనివారం రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు, బియ్యం, మందులు అందజేశారు. దీనితో పాటుగా ప్రతి నెల గోపాల్​కు అవసరమయ్యే మందులను తామే అందిస్తామని ఫౌండేషన్ స్థాపకుడు పెద్ది శంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్​కు బాధితుడు గోపాల్, ఫౌండేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.