రాజకీయం, ఆర్థిక లావాదేవీలే కేసీఆర్కు ముఖ్యమని... ప్రజా సంక్షేమం ఆయనకు ఏ మాత్రం పట్టదంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు... భూ పంచాయితీలు, ఇసుక దందాల్లో మునిగితేలుతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రుల సందర్శనలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు.
ప్రభుత్వ దవాఖానాలను పేదల దేవాలయాలుగా అభివర్ణించిన భట్టి విక్రమార్క... నర్సింగ్ సిబ్బంది, ఔట్ సోర్సింగ్ వైద్యులకు ఐదు నెలలుగా జీతాలు ఇవ్వలేకపోవడం సిగ్గు చేటన్నారు. ఆసుపత్రుల్లో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదని... అటు కృష్ణా జలాల్లోనూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఇది చూడండి 'ఎడారిలో తుపాను పుట్టించిన క్రికెటర్ సచిన్'