నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమంలో నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు అధిక సంఖ్యలో ఓట్లను నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.
పట్టభద్రుల ఎన్నికల్లో భాజపా అభ్యర్థినే గెలిపించాలని శ్రీధర్‌రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోందని రైతులను కూడా శాసించే స్థాయికి చేరిందని ఆయన ఆరోపించారు.
రైతులను సన్నరకాల ధాన్యం పెట్టమని చెప్పి తీరా వాటిని కొనుగోలు చేయడంలో విఫలమైందన్నారు. రైతులు తిండి తిప్పలుమాని.. పండించిన పంటను వేసుకుని మిల్లుల చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వం నోరు మెదపట్లేదని శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.
ఇదీ చదవండిః దుబ్బాక గెలుపుపై పార్టీల ధీమా... మెజార్టీ లెక్కల్లో నేతలు