ETV Bharat / city

నిధులు అడిగిన సర్పంచ్‌లను చంపేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం - కేసీఆర్​పై మండిపడిన బండి

Bandi Sanjay padayatra ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి సర్పంచ్‌లకు వచ్చిందంటూ... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు అడిగిన సర్పంచ్‌లను.. చంపేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా యాదాద్రి జిల్లా తుర్కులషాపూర్‌లోని గ్రామస్థులతో... బండి సంజయ్‌ సమావేశం అయ్యారు.

Bandi Sanjay
Bandi Sanjay
author img

By

Published : Aug 14, 2022, 8:39 PM IST

నిధులు అడిగిన సర్పంచ్‌లను చంపేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం

Bandi Sanjay padayatra: బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలోని గుండాల మండల కేంద్రానికి చేరుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు ఆ పార్టీ శ్రేణులు బతుకమ్మలు, బోనాలు, డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజలతో మమేకమై, వారి సమస్యలు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గుండాల మండలంలోని తుర్కలషాపూర్‌ గ్రామస్థులతో బండి సంజయ్‌ సమావేశం అయ్యారు. ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి సర్పంచ్‌లకు వచ్చిందంటూ... బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిధులు అడిగిన సర్పంచ్‌లను.. చంపేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందని ఆరోపించారు. కొద్దో గొప్పో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే అయ్యిందని అన్నారు. తెలంగాణలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా తయారయ్యిందని సంజయ్ మండిపడ్డారు. అధికారపక్షం వాళ్లు ఉపఎన్నికలు కోరుకుంటున్నారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

నిజమైన రైతులకు, కౌలు రైతులకు రైతుబంధు రావడం లేదని.. కాలేజీలు, ఫామ్​హౌస్​లు ఉన్నవాళ్లకి మాత్రమే రైతుబంధు వస్తుందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వచ్చేది భాజపా ప్రభుత్వమే అని.. కేసీఆర్ సర్కార్ పతనం మొదలైందని అన్నారు. కేసీఆర్ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారని.. పేదవాళ్లకు జాగాలు ఇవ్వకపోగా... వాళ్ల స్థలాలు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఉచిత పథకాలు వద్దని మోదీ ఎప్పుడూ అనలేదని.. పేదలకు సంక్షేమం పేరుతో పథకాలను అందిస్తున్నదే తమ ప్రభుత్వమని బండి సంజయ్ అన్నారు.

'కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో... ప్రజల కల సాకారం కాలేదు. రాష్ట్రం వచ్చాక లాభపడ్డది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో... ఇక్కడికి రాలేదు. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే... పాదయాత్రగా మీ ముందుకి వచ్చాను. భాజపా ప్రభుత్వం వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది.'-బండి సంజయ్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.