ETV Bharat / city

చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనంలో సాంకేతిక లోపం - చంద్రబాబు కాన్వాయ్ వార్తలు

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయాణిస్తున్న కారులో సమస్య తలెత్తింది. ఫలితంగా నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద కాసేపు చంద్రబాబు వాహనశ్రేణి నిలిచిపోయింది. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ఘటన జరిగింది.

చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనంలో సాంకేతిక లోపం

author img

By

Published : Nov 13, 2020, 7:58 PM IST

Updated : Nov 13, 2020, 8:07 PM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక సమస్య తలెత్తి రహదారిపై ఆగిపోయింది. శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో ఏపీలోని ఉండవల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం నల్గొండ జిల్లా నార్కెట్​పల్లి వద్దకు రాగానే హైవేపై వాహనం దాదాపు 20నిమిషాల పాటు నిలిచిపోయింది. కొద్దిసేపు వాహనంలోనే కూర్చున్న చంద్రబాబు... తర్వాత వెనుకే ఉన్న మరో వాహనం ఎక్కి హైదరాబాద్​కు పయనమయ్యారు.

ఇదీ చదవండి: 'వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు... తెరాస ఎంత?'

Last Updated : Nov 13, 2020, 8:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.