మంచిర్యాల జిల్లా చెన్నూరులో శనివారం నిరాడంబరంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలోని మందమర్రి, చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం మండలంలోని ప్రజలు గణేశ్ చతుర్థి వేడుకలను జరుపుకున్నారు.
చాలా మంది మట్టితో తయారు చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వరసిద్ధి వినాయకుని మండపాలకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల సందడి లేకుండానే పండుగను జరుపుకుంటున్నారు.
ఇదీ చదవండి : శ్రీశైలం అగ్నిప్రమాదం ఘటనలో తొమ్మిది మంది మృతి