ETV Bharat / city

ధాన్యం అమ్ముకోలేక రైతుల గోస

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రైతుల ధాన్యం అమ్మకాల కష్టాలు కొనసాగుతున్నాయి. జిల్లా మంత్రులు, కలెక్టర్లు, అధికారులు వరుస సమీక్షలు నిర్వహించినా క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు మాత్రం తొలగిపోవడం లేదు. ఎంత మొరపెట్టుకున్న పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండటంతో అగ్రహానికి గురవుతున్న అన్నదాతలు.. చివరకు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో మాత్రం వేగం కనిపించడంలేదు.

face difficulties in selling grain
ధాన్యం అమ్మకాల కష్టాలు
author img

By

Published : May 21, 2021, 4:56 PM IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం అమ్మేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలకు చాలాచోట్ల ధాన్యం బస్తాలు తడిసి నష్టపోతున్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలంలో బుధవారం కురిసిన వర్షానికి ధాన్యపు బస్తాలు తడిచిపోయి అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. వనపర్తి జిల్లా మదనాపురంలో కోతలు పూర్తై అమ్మకానికి ధాన్యం సిద్ధంగా ఉన్నా.. గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడెక్కారు. ఇలా ఉమ్మడి జిల్లాలో గన్నీబ్యాగులు, లారీల కొరత, మిల్లర్లు ధాన్యాన్ని దింపుకోవడం లేదని, తరుగుపేరుతో కోతలు వేస్తున్నారని ఏదో ఓ చోట ఆందోళన బాట పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మాత్రం వేగం పుంజుకోవడం లేదు. మిల్లర్లు తక్కువ ధరలకు సొంతంగా కొనుగోళ్లు చేస్తూ కావాలనే ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు.

కొనుగోలు చేసి వారం గడిచినా..

మహబూబ్‌నగర్‌ జిల్లా సీసీకుంట మండలం బండర్‌పల్లిలో 2,100 ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించకుండా ఉండిపోయాయి. కొనుగోలు చేసి వారం గడిచినా లారీలు రాక ధాన్యాన్ని మిల్లులకు తరలించలేదు. టార్పాలిన్లు అద్దెకు తీసుకువచ్చి బస్తాలు తడవకుండా కప్పుతున్నారు. రోజువారీ ఖర్చులు పెరగిపోతుండగా.. వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నారు. ఈ పరిస్థితులు చూసి మిగతా రైతులు అమ్మేందుకు ధాన్యం తీసుకురావాలంటనే ఆందోళన చెందుతున్నారు. ఇంతకంటే ప్రైవేటులో అమ్ముకోవడం మేలని.. బండర్‌పల్లిలో కొంతమంది రైతులు క్వింటాకు 15 వందలకే విక్రియించేశారు. ప్రభుత్వ మద్దతు ధర 18వందల88 రూపాయలుండగా.. బయట అమ్ముకుని నష్టపోతున్నారు.

కొర్రీలు పెడుతూ..

ధాన్యాన్నితరలించేందుకు గుత్తేదారులు సరిపడా లారీలు పంపడం లేదు. మిల్లులకు తీసుకువెళ్లిన లారీలు అక్కడే ఉండిపోతున్నాయి. ట్రాక్టర్లతో రైతులే మిల్లులకు ధాన్యం తరలించినా.. కొర్రీలు పెడుతూ ధాన్యం దింపుకోవడం లేదు. బస్తాకు 2 నుంచి 5 కిలోల చొప్పున మిల్లర్లు తరుగు తీస్తున్నారు. ధాన్యం తరలింపు జాప్యాన్ని నివారించేందుకు మహబూబ్‌నగర్ జిల్లాలో కార్గో బస్సులను రంగంలోకి దింపినా మిల్లుల వద్ద పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది.

రికార్డు స్థాయిలో ధాన్యం పండినా..

ఈసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. ప్రస్తుతం మార్కెట్లకు వచ్చింది 30శాతం మాత్రమే. ఇంకా 8లక్షల మెట్రికల్ టన్నులకు పైగా ధాన్యం పోటెత్తనుంది. తరలింపు ప్రక్రియ పుంజుకోకపోతే జూన్‌లో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో లోపాల్ని సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: సెంట్రల్​ జైలులో ఖైదీలతో సీఎం ముచ్చట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.