ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 261 కేసులు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 99, మహబూబ్‌నగర్ 67, వనపర్తిలో 53, నాగర్‌కర్నూల్ 37, నారాయణపేటలో ఐదుగురికి కొవిడ్ నిర్ధారణ అయ్యింది.
- గద్వాల జిల్లా కేంద్రంలో 11, వడ్డేపల్లి 23, అలంపూర్ 18, మానవపాడు, అయిజలో 9 మంది చొప్పున, ధరూరు 8, మల్దకల్ 6, రాజోలి 5, గట్టులో ఒకరు కొవిడ్ బారినపడ్డారు. జిల్లాలో 1331 యాక్టివ్ కేసులు ఉండగా.. 1202 మంది హోం క్వారంటైన్‌లో, 40 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారు.
- మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 49, జడ్చర్లలో 9, భూత్పూరు 4, మూసాపేట 2, సీసీకుంట, దేవరకద్ర, బాలానగర్‌లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. జిల్లాలో ఒకరు కరోనాతో మృతి చెందారు. జిల్లాలో 1091 యాక్టివ్ కేసులు ఉండగా.. 1172 మంది హోం క్వారంటైన్‌లో, 68 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 36 మంది మృతి చెందారు.
- వనపర్తి జిల్లా కేంద్రంలో 20, పెబ్బేరు 9, అమరచింత, కొత్తకోట 6, ఆత్మకూరు 5, పాన్‌గల్‌లో నలుగురు వైరస్ బారినపడ్డారు. గోపాల్‌పేట, మదనాపురం, రేవల్లిలో ఒక్కొక్కరికి వైరస్ సోకింది. జిల్లాలో 487 యాక్టివ్ కేసులు ఉండగా.. 559 మంది హోం క్వారంటైన్‌లో, 136 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు.
- నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో 11, తెలకపల్లి, కొల్లాపూర్, కల్వకుర్తిలో 5 మంది చొప్పున, వెల్దండ, అచ్చంపేటలో నలుగురు చొప్పున, పెద్దకొత్తపల్లి 2, ఉర్కొండ, తెల్కపల్లి, లింగాల, వంగూర్, పెంట్లవెల్లి, అమ్రబాద్ ఒక్కొక్కరికి కొవిడ్ నిర్దారణ అయ్యింది. జిల్లాలో 737 యాక్టివ్ కేసులు ఉండగా.. 689 మంది హోం క్వారంటైన్‌లో, 48 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 12 మంది మృతి చెందారు.
- నారాయణపేట జిల్లా కేంద్రంలో ఒకరు, మక్తల్‌లో ముగ్గురు, కోస్గిలో ఒకరు కరోనా మహమ్మారి బారినపడ్డారు. జిల్లాలో 249 యాక్టివ్ కేసులు ఉండగా.. 245 మంది హోం క్వారంటైన్‌లో, నలుగురు ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందారు.
ఇదీ చదవండి: అటవీశాఖ అధికారుల వాహనాన్ని వెంబడించిన గజరాజు