బొలెరో వాహనాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా కొల్లాపూర్‌కు తరలిస్తున్న బెల్లాన్ని వెల్దండ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను పరిశీలించగా.. అందులో 26 క్వింటాళ్ల బెల్లం గుర్తించారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాదు శ్రీశైలం జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద వెల్దండ పోలీసులు రెండు వాహనాల్లో 26 క్వింటాళ్ల అక్రమ బెల్లం గుర్తించారు. రెండు వాహనాలు, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని కల్వకుర్తి ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనాలను, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు కల్వకుర్తి ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపారు.