ETV Bharat / city

రైళ్లు బంద్​: ఉపాధి కోల్పోయిన వ్యాపారులు, కూలీలు

బతుకు బండికి కరోనా సెగ తగిలింది. రైళ్లు పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయి. వందలాది మంది ఉపాధి కోల్పోయారు. చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారింది. మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌పై ఆధారపడి జీవిస్తున్న వందల మంది ఉపాధి కోల్పోయి కష్టాలు పడుతున్నారు

రైళ్లు బంద్​: ఉపాధి కోల్పోయిన వ్యాపారులు, కూలీలు
రైళ్లు బంద్​: ఉపాధి కోల్పోయిన వ్యాపారులు, కూలీలు
author img

By

Published : Jul 28, 2020, 5:30 AM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక రైళ్లు మాత్రమే పరిమిత సంఖ్యలో నడుస్తున్నాయి. గతంలో ఉన్నట్లుగా ప్రయాణికుల సందడి లేదు. రైల్వే స్టేషన్లు బోసి పోతున్నాయి. ఫలితంగా రైల్వే కూలీలు, ఆటో డ్రైవర్లు, హోటళ్లు, టీ కొట్టు నిర్వాహకులు, పుస్తక విక్రేతల జీవనం కష్టతరంగా మారింది.

రోడ్డున పడ్డారు..

మహబూబ్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ నుంచి.. హైదరాబాద్‌, కర్నూలు వైపు నిత్యం 36 రైళ్లు రాకపోకలు సాగుతుండేవి. ఉమ్మడి జిల్లా మీదుగా 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండేవారు. దిల్లీ, జబల్‌పూర్‌, ఓకా, కోర్బా, జైపూర్‌ తదితర నగరాలకు, దక్షిణాది వైపు బెంగళూరు, చెన్నై, తిరుపతి, మధురై, రామేశ్వరం తదితర ప్రధాన పట్టణాలకు రైళ్లు నడిచేవి. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా రైళ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బాలానగర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మొదలు కొని అలంపూర్‌ వరకు 150 కిలో మీటర్ల మేర రైలు మార్గం ఉంది. పదుల సంఖ్యలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల మీద ఆధారపడి జీవనం సాగించే కూలీలు, ఆటో డ్రైవర్లు, హోటళ్ల నిర్వహకులు రోడ్డునపడ్డారు. మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ను అనుబంధంగా నడిచే ఆటోలు నిలిచిపోయాయి. వ్యాపారం లేక హోటళ్లు, టీ, పాన్‌ కొట్టులు చతికిలపడ్డాయి.

కుటుంబ పోషణ భారమైంది..

రైళ్లు నడిచే సమయంలో రోజూ రూ.500 వరకు సంపాదన ఉండేదని.... ప్రస్తుతం రెండు వందలు కూడా రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇల్లు గడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకు చాలా కష్టంగా మారిందని... పిల్లల పోషణ భారంగా భారమైందిని గోడు చెప్పుకుంటున్నారు.

అద్దె మాఫీ చేస్తే..

నాలుగు నెలలుగా రైళ్లు తిరగక పోవడంతో స్టేషన్‌పై ఆధారపడి జీవనం సాగించే రైల్వే కూలీలు, వివిధ వర్గాల వ్యాపారుల జీవనం కష్టతరంగా మారింది. రైళ్లు నడిచే వరకు రైల్వే అధికారులు దుకాణాల అద్దె మాఫీ చేయాడంతో పాటు.. తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: గణనీయంగా తగ్గిన కరోనా మరణాల రేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.