మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో ఏడాదిన్నర కాలంలో... సుమారు 12వేల మంది కొవిడ్‌కు చికిత్స పొందారు. అక్కడి మరణాల రేటు కేవలం 0.50 శాతం. ఆసుపత్రిలో చేరిన వారిలో 99.5 శాతం మంది కోలుకున్నవారే. కరోనా జడలు విప్పిన తొలినాళ్ల నుంచి ఇప్పటి సెకండ్ వేవ్ వరకూ జిల్లాఆసుపత్రి సారధిగా ముందుండి నడిపించారు.. సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్.
రెండుసార్లు కరోనా బారినపడి, కోలుకుని, తిరిగి విధుల్లో చేరి తన సేవలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కోవిడ్ కేసుల తీరు, లక్షణాలు, చికిత్స సహా కరోనాపై పోరాటంలో తన అనుభవాలను మనతో పంచుకున్నారు. కరోనా పట్ల ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యమే అనేక ప్రతికూల ప్రభావాలకు కారణమవుతోందంటున్న... డాక్టర్ రాంకిషన్ తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
- ఇదీ చూడండి: కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్