ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్యం 800 దాటింది.
నాగర్‌కర్నూల్ జిల్లా
జిల్లాలో 13 మంది వైరస్ బారిన పడ్డారు. జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో ఇద్దరికి, మండలంలోని పెద్దాపూర్ గ్రామానికి చెందిన మహిళకు కొవిడ్ సోకింది. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లికి చెందిన బాధిత రైతు కుటుంబంలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. అచ్చంపేటలో ఆర్టీసీ ఉద్యోగి, కోవిడ్ బాధిత వైద్యుడి కుతుర్తె, వైద్య ఉద్యోగి, బల్మూర్ మండలంలోని నర్సాయిపల్లికి చెందిన ఉపాధ్యాయుడికి కొవిడ్ సోకింది.
మహబూబ్‌నగర్ జిల్లా
మహబూబ్‌నగర్ జిల్లాలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు పోలీసు అధికారులు కొవిడ్ బారిన పడ్డారు. ఏనుగొండ, కమలానెహ్రూ కాలనీ, మైత్రినగర్, లక్ష్మీనగర్‌కాలనీ, హనుమాన్‌నగర్, నలందా ఆటోస్టాండ్, పద్మావతీకాలనీలకు చెందిన ఒక్కొక్కరికి కరోనా సోకింది. జడ్చర్ల పట్టణానికి చెందిన ఒకరు, కోయిల్‌కొండ మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన మరొకరికి పాజిటివ్ వచ్చింది.
జోగులాంబ గద్వాల జిల్లా
జోగులాంబ గద్వాల జిల్లాలో 10 కేసులు నమోదు కాగా.. వాటిలో ఏడు కేసులు జిల్లా కేంద్రానికి చెందినవే ఉన్నాయి. తెలుగుపేటలో ఇద్దరు, రాంనగర్‌లో మరో ఇద్దరు, దౌదర్‌పల్లి, నేతాజీనగర్‌లో ఒక్కొక్కరు, ఓ బ్యాంకు ఉద్యోగి కొవిడ్ బారిన పడ్డారు. ఉండవల్లిలో కానిస్టేబుల్, అలంపూర్ మండలం క్యాతూర్‌లో ఒకరు, అయిజలో ఒకరికి కరోనా సోకింది.
వనపర్తి జిల్లా
వనపర్తి జిల్లాలో 6 మంది కరోనా బారిన పడగా.. అందరూ జిల్లా కేంద్రానికి చెందిన వారే ఉన్నారు. సగరవీధి, ఆర్టీసీకాలనీ, కేడీఆర్‌నగర్, బసవన్నగడ్డ, రాంనగర్. ఐజయ్యకాలనీలల్లో ఒక్కొక్కరు కరోనా వైరస్ బారిన పడ్డారు.
నారాయణపేట జిల్లాలో ఇవాళ ఒక్క కొవిడ్ -19 కేసు నమోదు కాలేదు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 1296 కరోనా కేసులు.. ఆరుగురు మృతి