ETV Bharat / city

కేటీఆర్​ కాన్వాయ్​కు అడ్డుపడిన కుటుంబం.. కారణమిదే - మహబూబ్​నగర్​ తాజావార్తలు

మహబూబ్‌ నగర్‌ కేటీఆర్​ కాన్వాయ్​కు ఓ కుటుంబం అడ్డుపడింది. వీరన్నపేట పాత రైల్వే గేటు దాటిన తర్వాత కుమ్మరివాడికి చెందిన శివశంకర్‌ తన కుటుంబ సభ్యులతో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి మంత్రి కాన్వాయ్‌కు అడ్డంగా పడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పక్కకులాగి మంత్రుల కాన్వాయ్​కు దారి ఇచ్చారు.

ktr convoy stoped my a family in mahabubnagar distrciat
కేటీఆర్​ కాన్వాయ్​కు అడ్డుపడిన కుటుంబం.. కారణమిదే
author img

By

Published : Jul 14, 2020, 7:08 AM IST

Updated : Jul 14, 2020, 9:18 AM IST

మహబూబ్​నగర్​లో మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​కు ఓ కుటుంబం అడ్డుపడింది. భూమి కొనుగోలు చేసినప్పటి నుంచి తొమ్మిదేళ్లుగా తహసీల్దార్​ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందన లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని వీర్నపేటలో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవం ముగించుకొని కేటీఆర్​ తిరుగుపయనమయ్యారు. వీరన్నపేట పాత రైల్వే గేటు దాటిన తర్వాత కుమ్మరివాడికి చెందిన శివశంకర్‌ తన కుటుంబ సభ్యులతో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చి మంత్రి కాన్వాయ్‌కు అడ్డంగా పడిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని పక్కకులాగి మంత్రుల కాన్వాయ్​కు దారి ఇచ్చారు.

మహబూబ్‌నగర్ అర్బన్​ మండలం పరిధిలోని బండమీదిపల్లి శివారు పరిధిలో ఎకరా భూమి ఉందని బాధితుడు తెలిపారు. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం జారీచేయాలని అనేక సార్లు అధికారుల చుట్టు తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యలో నలుగురు తహసీల్దార్లు, ఆరుగురు వీఆర్వోలు మారిపోయారని తెలిపారు. కేటీఆర్​ దృష్టికి తమ సమస్యను తెలియజేయాలని మంత్రుల కాన్వాయ్​కు అడ్డుపడినట్లు తెలిపారు.

ఇవీచూడండి: చివాలయం కూల్చివేతపై మంత్రివర్గ తీర్మానం ఎక్కడ..: హైకోర్టు

Last Updated : Jul 14, 2020, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.