హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. రెండో ప్రాధాన్యతలో భాగంగా ప్రొ.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
వాణీదేవి భాజపా అభ్యర్థి రాంచందర్‌రావుపై 11,703 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తంగా వాణీదేవికి 1,49,269, ఓట్లు, రాంచందర్‌రావుకు 1,37,566 ఓట్లు, ఓట్లు వచ్చాయి. ఇక్కడ విజయం సాధించాలంటే 1,68,520 ఓట్లు రావాలి.