కరోనా ఉద్ధృతి దృష్ట్యా.. వైరస్‌ను అధిగమించేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ అఫ్ ఇండియన్ ఆర్జిన్ అధ్యక్షులు డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ తెలిపారు. విదేశాల నుంచి భారత్‌కు వైద్య పరికరాల పంపిణీలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. ప్రభుత్వాలు సహకరిస్తే మరింత ఉత్సాహంతో కృషి చేస్తామని చెప్పారు. దేశంలో రెండో దశ కొవిడ్ వ్యాప్తిని ప్రభుత్వాలు ఊహించలేకపోయాయని సుధాకర్ వెల్లడించారు. ఇతర దేశాల సహకారం తాత్కాలికమేనని.. వైద్య సదుపాయాల విషయంలో ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. మే నెలలోనే దేశంలో కరోనా ఉచ్ఛస్థితికి చేరుకునే అవకాశముందని.. జూన్‌లో తగ్గిపోవచ్చంటున్న డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డతో ఈటీవీ భారత్ ప్రతినిధి స్వామికిరణ్ ముఖాముఖి...
- ఇదీ చదవండి : 'చిన్నారుల కోసమైనా మోదీ ప్రభుత్వం నిద్రలేవాలి'