ETV Bharat / city

విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి: భాజపా - bjp devarkadra latest news

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేవరకద్రలో జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.

bjp leaders hoisted the national flag on the occasion of telangana liberation day in devarkadra mahabubnagar district
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి: భాజపా
author img

By

Published : Sep 17, 2020, 4:14 PM IST

Updated : Sep 17, 2020, 4:34 PM IST

మహబూబ్​గర్ జిల్లా దేవరకద్రలో భాజపా మండల శాఖ ఆధ్వర్యంలో... తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. తెలంగాణ అమరవీరులకు జోహార్ అంటూ.. నినాదాలు చేశారు. సెప్టెంబరు 17 విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భాజపా శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు యజ్ఞ భూపాల్ రెడ్డి, అంజన్ కుమార్ రెడ్డి, రాఘవేందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తహసీల్దారు కార్యాలయంపై జెండా ఎగురవేసేందుకు యత్నించిన భాజపా

Last Updated : Sep 17, 2020, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.