మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఉమ్మడి జిల్లాలో వైరస్ కేసులు 300 దాటగా... 21 మంది వైరస్‌తో మృతి చెందారు. మంగళవారం మరో 13 మందికి కొవిడ్ నిర్ధరణ కాగా అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 137 కేసులు నమోదయ్యాయి. గద్వాలలో 66, వనపర్తిలో 41, నాగర్‌కర్నూల్‌లో 38, నారాయణపేటలో 20 కేసులు వెలుగుచూశాయి. ఉమ్మడి జిల్లాలో కేసుల సంఖ్య 303కు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 7 కేసులు నమోదు కాగా.. వాటిలో 5 పట్టణానికి చెందినవే.
జోగులాంబ గద్వాల జిల్లాలో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 2 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి కరోనాతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా.. పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. చికిత్స పొందుతూ ఆయన మంగళవారం మృతి చెందారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇవాళ కరోనా కేసులు నమోదు కాలేదు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో మరో 1879 మందికి కరోనా.. 27,612కి చేరిన కేసులు