ETV Bharat / city

సింహంలా సింగిల్‌గా.. ప్రజాబాణమై వస్తున్నా: షర్మిల - వైఎస్​ షర్మిల వార్తలు

పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతానని వైఎస్​ షర్మిల స్పష్టం చేశారు. 'తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పంపితే మేం రాలేదు. సింహం సింగిల్‌గానే వస్తోంది. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మేం ఏ పార్టీ కిందా పనిచేయం' అని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి పార్టీ ఏర్పాటు అవసరమని షర్మిల చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఆత్మగౌరవ తెలంగాణ కోసం పార్టీ పెడుతున్నట్లు తెలిపారు.

ys sharmila
సింహంలా సింగిల్‌గా.. ప్రజాబాణమై వస్తున్నా: షర్మిల
author img

By

Published : Apr 9, 2021, 10:30 PM IST

తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన తిరిగి తీసుకురావాలని సంకల్పిస్తున్నామని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె వైఎస్​ షర్మిల అన్నారు. వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడిచేందుకు రాజకీయాల్లో తన తొలి అడుగు వేస్తున్నానని.. రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించారు. వైఎస్‌ జయంతి (జులై 8)నాడు పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించనున్నట్టు ఆమె స్పష్టంచేశారు. ఖమ్మంలోని పెవిలియన్‌ మైదానంలో నిర్వహించిన సంకల్ప సభలో షర్మిల మాట్లాడారు. సరిగ్గా ఇదే రోజున సంక్షేమ పాలనకు పునాదులు వేసుకుంటూ వైఎస్సార్‌ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమైందని గుర్తుచేశారు. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్​ను తిరిగి ప్రతిష్ఠించబోతున్నామని చెప్పారు.

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదు

రాష్ట్రంలో ఎన్నో సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, నిలదీయడానికి పార్టీ ఏర్పాటు అవసరమని షర్మిల చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఆత్మగౌరవ తెలంగాణ కోసం పార్టీ పెడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదనేది అక్షర సత్యమన్నారు. తెలంగాణ ఉద్యమంలో వందలమంది అమరులయ్యారని.. వారందరికీ తన జోహార్లని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే దానికి కారణం ఎవరని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో ఒక్క కొత్త రేషన్‌ కార్డు ఇవ్వలేదని.. కొత్త పింఛనూ లేదని ఆమె ఆరోపించారు. పేదలకు భూములు కూడా ఇవ్వలేదని విమర్శించారు.

ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణాన్ని..

'రాష్ట్రంలో పాలక పక్షాన్ని ప్రశ్నించే ప్రతిపక్షమే లేదు. అన్నీ ఒక తాను ముక్కలే. నువ్వు కొట్టినట్లు చేయ్‌.. నేను ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుంది వారి పరిస్థితి. జనం తరఫున పాలక పక్షాన్ని ప్రశ్నించే బలమైన గొంతుగా మన పార్టీ ఉంటుంది. తెరాస, భాజపా, కాంగ్రెస్‌ పంపితే మేం రాలేదు. సింహం సింగిల్‌గానే వస్తోంది. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. మేం ఏ పార్టీ కిందా పనిచేయం. పదవులు వచ్చినా రాకపోయినా తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా. ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తామని మాటిస్తున్నా. మా సంకల్పానికి మీ ఆశీస్సులు అవసరం. నేటి కార్యకర్తలే రేపటి నాయకులు. అధికార పార్టీకి భయపడొద్దు. ప్రజల పక్షాన పోరాటాలు చేయండి. కష్టమొస్తే అండగా నిలబడతా. రాజన్న నుంచి సంక్రమించిన ధైర్యముంది. చేయిచేయి కలిపి రాజన్న పాలన తీసుకొద్దాం.'

-వైఎస్​ షర్మిల

ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనే!

ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎవరికీ ఇష్టమున్నా.. లేకపోయినా తాను తెలంగాణ బిడ్డనే అని షర్మిల చెప్పారు. ఈ గడ్డమీదే బతికానని.. ఇక్కడి నీరే తాగానన్నారు. తన కుమారుడు, కుమార్తెను తెలంగాణ గడ్డపైనే కన్నానని చెప్పారు. ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని అనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. బరాబర్‌ తెలంగాణ కోసం నిలబడతా అని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కొట్లాడతానని.. అవకాశం ఇవ్వాలో వద్దో వాళ్లే నిర్ణయిస్తారన్నారు.

ఇవీచూడండి: జులై 8న పార్టీ పేరు, అజెండా ప్రకటిస్తా: షర్మిల

షర్మిలను ఆశీర్వదించండి: వైఎస్​ విజయమ్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.