ETV Bharat / city

ఆవిర్భావ వేడుకల్లో శానిటైజర్ల పంపిణీ - తెరాస ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం జిల్లా తెరాస కార్యాలయంలో పార్టీ 20వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలకు శానిటైజర్లు పంపిణీ చేశారు.

trs foundation day celebrations in khammam
ఆవిర్భావ వేడుకల్లో శానిటైజర్ల పంపిణీ
author img

By

Published : Apr 28, 2020, 8:57 AM IST

ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెరాస కీలక పాత్ర పోషిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరై, జెండా ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ దిశను మార్చే విధంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా మలిచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందని మంత్రి అన్నారు. లాక్​డౌన్​ దృష్ట్యా ఆవిర్భావ వేడుకలకు ముఖ్యులు మాత్రమే హాజరయ్యారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భౌతిక దూరం పాటించారు. అనంతరం అందరికీ శానిటైజర్లు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి: తెరాస భవన్​లో కేసీఆర్ పతాకావిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.