పార్టీ అధినేత నిర్ణయమే శిరోధార్యమని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం తెరాస అభ్యర్థి నామ నాగేశ్వర రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డితో ప్రచారంలో పాల్గొన్నారు. తెరాసలో క్రమశిక్షణ గల ఓ కార్యకర్తగా పని చేస్తానన్నారు. నామ నాగేశ్వర రావును అత్యధిక మెజార్టీతో గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి:సీఆర్పీఎఫ్ కాన్వాయ్ సమీపంలో పేలుడు