ETV Bharat / city

పెంపుడు కుక్క వేట మృగంలా వృద్ధురాలిపై దాడి.. ఆ తర్వాత.. - ఇల్లందు తాజా వార్తలు

Dog attack on old woman: ఇంట్లో పెంచుకుంటున్న ఓ శునకం.. వేట మృగంలా మారి వీరంగమే సృష్టించింది. ఏదో అలా బయట కూర్చుందామని వచ్చిన వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు దానిని వెళ్లగొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భయాందోళన చెందిన స్థానికులు శునకం తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

Dog attack on old woman
శునకం
author img

By

Published : Mar 22, 2022, 10:34 AM IST

Dog attack on old woman: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పెంపుడు కుక్క వృద్ధురాలిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. అది గమనించిన కుటుంబీకులు దానిని వెళ్లగొట్టి ఆమెను రక్షించారు.

ఏం జరిగిందంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తిలక్ నగర్ పంచాయతీలోని బంటు ముసలమ్మ(90) అనే వృద్ధురాలు ఇంటికే పరిమితమై అప్పుడప్పుడు ఇంటి ముందుకు వస్తూ వెళ్తూ ఉంటుంది. ఈ క్రమంలో రాత్రివేళ బయటకు వచ్చిన వృద్ధురాలిపై స్థానికంగా ఒక కుటుంబం పెంచుకుంటున్న శునకం అకస్మాత్తుగా దాడి చేసింది.

పోలీసులకు ఫిర్యాదు..

వృద్ధురాలు అరవ లేక పడిపోగా.. శునకం దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. కొంతసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఆ కుక్కని వెళ్లగొట్టారు. ముసలావిడను వెంటనే ఇల్లందు ఆసుపత్రికి అక్కడి నుంచి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడి చేసిన శునకం తాపీగా ఇంటికి వెళ్లి ఏమీ ఎరగనట్టు తనను పెంచుకుంటున్న వారి ఇంట్లో ఉండిపోయింది. ఈ ఘటనతో భయాందోళన చెందిన స్థానికులు శునకం తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. వీధి కుక్క కంటే ఘోరంగా ఇంట్లో పెంచుకుంటున్న శునకం ఇంత దారుణంగా దాడి చేయడం ఏమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:Wife Murder Plan: భర్త హత్యకు ప్రియుడితో కలసి వినూత్న పథకం వేసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.