ETV Bharat / city

వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ

ముంబయిలోని అంబేడ్కర్ నివాసం 'రాజగృహ'పై దాడి చేసిన నిందితులపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్​ చేశారు. ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చేసిన ధర్నా పాల్గొన్నారు.

mrps president mandakrishna madiga demand for pd act file on ambedkar house attackers
వారిపై రాజద్రోహం కేసు పెట్టాలి: మందకృష్ణ
author img

By

Published : Jul 10, 2020, 3:47 PM IST

అంబేడ్కర్ నివాసం 'రాజగృహ'పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాడ్​ చేస్తూ.. ఖమ్మంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ ఆందోళనలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. అంబేడ్కర్ ఇంటిపై దాడి చేసిన వారిని గుర్తించి వారిపై రాజద్రోహం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టాలన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.

దాడి సమయంలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్​ ఆ నివాసంలోనే ఉన్నారని తెలిపారు. అంబేడ్కర్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. నేటి నుంచి ఈనెల 18 వరకు జరిగే నిరసన కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్ శ్రేణులు భౌతిక దూరం పాటిస్తూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.