భారత్ బంద్‌కు మద్దతుగా ఖమ్మంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద... తెరాస లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రైతుసమన్వయసమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ధర్నా నిర్వహించారు. రహదారిపై బైఠాయించి నేతలు నిరసన తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పార్టీ కార్యదర్శి తాతా మధు, ఖమ్మం మేయర్ పాపాలాల్, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మందడపు సుధాకర్, మద్దినేని స్వర్ణకుమారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.