మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతి తెలంగాణ రాష్ట్రానికి, తెరాసకు తీరని లోటని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా తెరాస కార్యాలయంలో నాయిని చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఉద్యమకాలంలో కేసీఆర్‌కు కుడి భుజంగా ఉన్నారని కొనియాడారు. తెలంగాణ తొలి హోంశాఖ మంత్రిగా శాంతి భద్రతలను కాపాడి సీఎం మెప్పు పొందారన్నారు. నివాళులు అర్పించి వారిలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, కార్పోరేటర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నాయిని నర్సింహారెడ్డికి సంతాపం తెలిపిన మంత్రులు